ప్రిన్స్ యాద‌వ్ దెబ్బ‌కు ఆర్సీబీ విల విల

4 ఓవ‌ర్లు 33 ర‌న్స్ 3 కీల‌క వికెట్లు

ల‌క్నో : ఐపీఎల్ 19వ లీగ్ సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో ఇప్ప‌టికే మూడు జ‌ట్లు చేరుకున్నాయి. ఒకే ఒక్క స్థానం కోసం పోటీ ప‌డుతున్నాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే విజ‌యాల‌తో దూసుకు పోతున్న ఆర్సీబీకి ఝ‌ల‌క్ ఇచ్చింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 19.2 ఓవ‌ర్ల‌లో 213 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 209 ప‌రుగులు చేసింది ఆరు వికెట్లు కోల్పోయి. దీంతో ల‌క్నో 9 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఆ జ‌ట్టుకు ఇది ఆరు అప‌జ‌యాల త‌ర్వాత ద‌క్కిన విజ‌యం.

ఇక ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది ల‌క్నో బౌల‌ర్ ప్రిన్స్ యాద‌వ్. అద్భుత‌మైన బౌలింగ్ ప‌ర్ ఫార్మెన్స్ తో ఆర్సీబీ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. త‌ను 4 ఓవ‌ర్లు వేసి 33 ర‌న్స్ ఇచ్చి 3 కీలక వికెట్ల‌ను కూల్చాడు. ఆర్సీబీ ప‌త‌నాన్ని శాసించాడు. షమీ, ప్రిన్స్‌ ఆరంభ ఓవర్లలో విజృంభించడంతో బెంగళూరు మొదటి 8 బంతుల్లోనే బెతెల్‌ (4), కోహ్లీ (0) వికెట్లను కోల్పోయింది. 9 రన్స్‌కే ఓపెనర్లను నష్ట పోయిన ఆర్‌సీబీని పడిక్కల్‌, రజత్‌ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక బ్యాట్‌ ఝుళిపించారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *