స్వదేశీ పర్యాటకం వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత

యువతకు లక్ష ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌న్న చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : అమరావతి అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన బైసర్‌ను, కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావును అభినందిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. విద్య, వైద్యంలో తిరుగులేని స్థాయిలో ఉండేలా 25 కిమ్స్ ఏర్పాటువుతోందన్నారు. మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్యం అందించేలా సంస్థ ఎదగనుందన్నారు. 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని చెప్పారు. 250 మెడికల్ సీట్లు, 1,000 నాన్ మెడికల్ సీట్లు, మరో 1,000 మంది ట్రైనీలు తయారు కావాలన్నారు. డెంటల్, ఫిజియో థెరపీ వంటి సుమారు 5,000 మందిని నియమించుకునే అవకాశం ఉందన్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్లు చాలా అవసరం ఉంద‌న్నారు. డాక్టర్లు కూడా ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు సీఎం.
గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. ఆయ‌న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. అలాంటి అరాచక పాలన నా జీవితంలో చూడలేదన్నారు. నేను పిల్లల భవిష్యత్ మాత్రమే చూస్తాను. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనేది నా ఆలోచన అని ప్ర‌క‌టించారు. ఇటీవలే గూగుల్‌ డేటా సెంటర్‌కు భూమి పూజ చేసుకున్నాం. 2028 ఆగస్ట్ కి ముందే నిర్మాణం పూర్తి చేసి ఆపరేషన్ ప్రారంభించాలని సూచించాను. ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. 2028 డిసెంబర్‌కు ఫేజ్ 1 సిద్ధం అవుతుంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *