newsseals.com
SPORTS

గెలుపులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది

VijayaBhaskar May 17, 2026
newsseals-FinnAllenn
Spread the love

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్టార్ ప్లేయ‌ర్ ఫిన్ అలెన్

కోల్ క‌తా : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. 29 ప‌రుగుల తేడాతో ఓడించింది. కేకేఆర్ కు చెందిన ఫిన్ అలెన్ దుమ్ము రేపాడు. త‌ను కేవ‌లం 35 బంతులు ఆడి 7 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. 93 ప‌రుగులు చేశాడు. త‌న‌తో పాటు యంగ్ క్రికెట‌ర్ ర‌ఘువంశీ ఉతికి ఆరేశాడు. త‌ను కూడా 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వీరితో పాటు క్యామెరూన్ కూడా ఆడాడు. భారీ స్కోరు సాధించ‌డంతో గుజ‌రాత్ ప్లేయ‌ర్లు విల విల లాడారు.

కోల్ క‌తా గెలుపొందిన అనంత‌రం స్టార్ ప్లేయ‌ర్ ఫిన్ అలెన్ మీడియాతో మాట్లాడారు. KKR ఈ మ్యాచ్ గెలవడంలో సహాయ పడినందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నాడు. అలాగే ఈ రోజు, Instagramలో నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి కలుగుతోందన్నాడు. జట్టు నుండి నన్ను తప్పించినప్పుడు, నాకు మరో అవకాశం వస్తే నన్ను నేను నిరూపించు కుంటానని చెప్పాన‌ని, తానేమిటో నిరూపించుకున్నాన‌ని చెప్పాడు ఫిన్ అలెన్. కోల్‌కతా అభిమానులకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మాపై ఆశ వదులుకోవద్దు. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడానికి మేం వంద శాతం కృషి చేస్తామ‌న్నారు.