newsseals.com
ENTERTAINMENT

నేనంత దిగజార లేదన్న ర‌జ‌నీకాంత్

VijayaBhaskar May 17, 2026
newsseals-Rajinikanth
Spread the love

ఓడి పోయినందుకే స్టాలిన్ ను ప‌రామ‌ర్శించా
చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు త‌లైవా ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై వ‌స్తున్న దుష్ప్ర‌చారంపై స్పందించాడు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఆదివారం ర‌జ‌నీకాంత్ మీడియాతో మాట్లాడాడు. తాజాగా రాష్ట్రంలో డీఎంకే పార్టీ త‌న అధికారాన్ని కోల్పోయింది. ద‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సార‌థ్యంలోని టీవీకే పార్టీ భారీ మెజారిటీని సాధించింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ స‌మ‌యంలో డీఎంకేకు 59 సీట్లే వ‌చ్చాయి. అయితే తాను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌ను క‌లిపేదుకు స్టాలిన్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రిగాయి. పుకార్లు షికార్లు చేశాయి కూడా.

దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు న‌టుడు ర‌జ‌నీకాంత్. కొలత్తూరులో ఓటమి పాలైనందుకు స్టాలిన్ పట్ల నాకు బాధ కలిగిందన్నారు.. అందుకే నేను ఆయన్ని కలిశానన‌ని చెప్పారు. విజయ్ ముఖ్యమంత్రి కాకూడదని నేను అన్నానని, అలాగే రెండు పార్టీలను విలీనం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నానని పుకార్లు వ్యాపించడం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న‌కు గుర‌య్యారు ర‌జ‌నీకాంత్. ఆ విధంగా మాట్లాడేంత దిగజారిన వ్యక్తి రజినీకాంత్ కాద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. తాను ఏనాడూ ప‌ద‌వుల కోసం పాకులాడ లేద‌న్నారు. త‌న జీవితం, గ‌మ్యం వేరు అని పేర్కొన్నారు.