newsseals.com
News

‘స‌న్’ స్ట్రోక్ ఎఫెక్ట్ బండి మంత్రి ప‌ద‌వికి ఎస‌రు

Posted by: VijayaBhaskar May 17, 2026
newsseals-BandiSanjjay

సంజ‌య్ రాజీనామా చేస్తారా లేక చేయిస్తారా

హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు పోక్సో కేసు వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా… లేక ఆయన్ను రాజీనామా చేయిస్తారా అనేది పెద్ద ఎత్తున చ‌ర్చ కొన‌సాగుతోంది. పోక్సో (POCSO) కేసులో అరెస్టు అయిన సంజయ్ కుమారుడు భగీరథ్ జైలుకు వెళ్లారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, బీజేపీకి తలనొప్పిగా మారింది. గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో, ఏ మంత్రి కుమారుడూ పోక్సో కేసులో అరెస్టు కాలేదు. మోదీ మంత్రివర్గంలోని ఏ మంత్రి కూడా ఇంతకు ముందెన్నడూ ఈ రీతిలో ప్రభుత్వానికి అపకీర్తి తీసుకు రాలేదు.

దీని పర్యవసానంగా బండి సంజయ్‌ను పక్కన పెట్టి, ఆయన పదవిని తెలంగాణకు చెందిన ఒక బీసీ (BC) నాయకుడికి అప్పగిస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. భగీరథ్‌పై నమోదైన కేసు నిజమని రుజువైతే, అతనికి 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బాధితురాలైన మైనర్ బాలిక తరపు న్యాయవాదులు ఇప్పటికే రాష్ట్రపతికి లేఖ రాస్తూ, సంజయ్‌ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మ‌రో వైపు కేసు బ‌లంగా బాధితురాలి వైపు ఉండ‌డం ప్ర‌ధానంగా మారింది.