క‌ల్కి కోసం ‘క‌మ‌ల్’ ఎకాన‌మీ ఫ్లైట్ లో ప్ర‌యాణం

VijayaBhaskar · May 19, 2026
Spread the love

పొదుపు పాటించాల‌ని పిలుపు ఇచ్చిన ప్ర‌ధాని

హైద‌రాబాద్ : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్ర న‌టుడిగా గుర్తింపు పొందిన ఇల‌య నాయ‌గ‌న్ , ఎంపీ క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేర‌కు త‌ను కూడా ఆచ‌రించ‌డం మొద‌లు పెట్టారు. తాను ఎంపీ అయిన‌ప్ప‌టికీ సాధార‌ణ క్లాస్ లోనే విమానంలో ప్ర‌యాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ముందు నుంచీ ఆధునిక భావ‌జాలం క‌లిగిన వ్య‌క్తిగా, విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందారు. ఆయ‌న నినాదం ఒక్క‌టే ప్ర‌తి ఒక్క‌రు బాగుండాల‌ని, మాన‌వ‌త్వాన్ని క‌లిగి ఉండాల‌న్న‌ది ఉద్దేశం. దీని గురించి ఆయ‌న రాజ్య‌స‌భ సాక్షిగా ప్ర‌స్తావించారు.

తాజాగా ఆయ‌న వార్త‌ల్లోకి ఎక్క‌డానికి ప్ర‌ధాన కార‌ణం స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకోవ‌డం. పేరు పొందిన వారంతా ఇలాంటి ప‌నులు చేస్తే మిగ‌తా వారు కూడా ఆచ‌రిస్తార‌ని క‌మ‌ల్ హాస‌న్ న‌మ్మ‌కం. అందుకే తాను ఎందుకు చేయ‌కూడ‌ద‌ని ముందే ప్రిపేర్ అయి వ‌చ్చారు. సాధారణ ఎకానమీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ హైదరాబాద్ లో కల్కి షూటింగ్ సెట్స్‌కు వచ్చారు. దీంతో షూటింగ్ లో ఉన్న వారంతా విస్తు పోయారు. సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.