సెంచ‌రీ చేయ‌లేద‌న్న బాధ లేదు : వైభ‌వ్

VijayaBhaskar · May 20, 2026
Spread the love

జ‌ట్టు విజ‌యం అత్యంత ముఖ్యమ‌న్న కిడ్

జైపూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది ల‌క్నో . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 220 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ మ‌రోసారి విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌ను 96 ప‌రుగులు చేశాడు. త‌న‌కు తోడుగా ఇంగ్లీష్ కూడా సూప‌ర్ షో చేశాడు. దీంతో భారీ స్కోరు న‌మోదైంది. అనంత‌రం బ‌రిలోకి దిగింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌ను కేవ‌లం 38 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్స‌ర్లు కొట్టాడు. త‌న‌తో పాటు స్టాండింగ్ కెప్ట‌న్ య‌శ‌స్వి జైస్వాల్ 48 ర‌న్స్ చేశాడు.

మరో వైపు ధ్రువ్ జురైల్ స‌త్తా చాటాడు. త‌ను 52 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు . జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ గెలుపొంద‌డంలో కీల‌క పాత్ర పోషించిన వైభ‌వ్ సూర్య‌వంశీకి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది . ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాడు. తను మైదానంలోకి దిగితే కేవ‌లం ఆట‌పైనే ఫోక‌స్ పెడ‌తాన‌ని, టార్గెట్ ఛేదించ‌డంలో దృష్టి సారిస్తాన‌ని చెప్పాడు. త‌న‌కు సెంచ‌రీ చేయ‌డం కంటే జ‌ట్టు విజ‌యం ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు వైభ‌వ్ సూర్య వంశీ.