ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు న‌మోదు

ఓ టీవీ ఛానెల్‌పై కూడా కేసు ఫైల్

అమ‌రావ‌తి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ , అన‌లిస్ట్ నాగేశ్వ‌ర్ రావుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న తాజాగా ఓ టీవీ ఛాన‌ల్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు న‌మోదు చేశారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు. ఇదిలా ఉండ‌గా టీవీ ఛాన‌ల్ లో కీల‌క అంశంపై డిబేట్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్. త‌న‌కు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం వ‌చ్చింద‌ని, ప్ర‌ధానంగా ఆయ‌న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

జ‌న‌సేన పార్టీ కోర్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింద‌ని, ఈ త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీకి వెళ్లార‌ని, త‌న‌తో పాటు నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా దేశ రాజ‌ధానికి వెళ్లార‌ని ఆ స‌మ‌యంలో త‌మ‌పై తీవ్ర ఒత్తిడి వ‌చ్చింద‌ని, జ‌గ‌న్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరార‌ని అన్నార‌ని తెలిపారు. చంద్ర‌బాబుతో తాత్కాలిక సంబంధం ఉంటుంద‌ని, కానీ జ‌గ‌న్ రెడ్డితో లాంగ్ టర్మ్ రిలేష‌న్ షిప్ ఉంద‌ని ఆ విష‌యం త‌న‌కు తెలిసింద‌న్నారు. దీంతో త‌న‌పై ఫిర్యాదు చేశారు జ‌న‌సైనికులు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *