తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తా

నూత‌న చైర్మ‌న్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ

వ‌రంగ‌ల్ జిల్లా : తెలుగు అకాడ‌మీ నూత‌న చైర్మ‌న్ గా ఎంపికైన డాక్ట‌ర్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు. త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు వ‌రంగ‌ల్ లోని హ‌నుమ‌కొండ లోని త‌న నివాసంలో. వెంక‌ట్ నారాయ‌ణ త‌న జీవిత కాలంలో తెలంగాణ ఉద్య‌మానికి ఇతోధికంగా సేవ‌లు అందించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాతగా గుర్తింపు పొందారు. అలుపెరుగని ఉద్యమకారుడిగా పేరొందారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారులు వారిని మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.

అనంతరం వేదిక రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి మాట్లాడారు. ఉద్యమ తొలి కాలం నుండి ప్రొఫెసర్ లు కొత్తపల్లి జయ శంకర్, బియ్యాల జనార్ధన్, గద్దర్, కాళోజీ నారాయణ రావు, భూపతి కృష్ణమూర్తి తో క‌లిసి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ఎంత‌గానో శ్ర‌మించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ ఆకాంక్షల కోసం నిరంతరం శ్రమించిన వెంకట్ నారాయణకు తెలుగు అకాడమీ చైర్మన్ పదవి దక్కడం ఉద్యమకారులందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు చైర్మ‌న్ అప్ప‌గించిన స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు వెంక‌ట్ నారాయ‌ణ‌. తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *