సంస్థ బ‌లోపేతం కోసం కృషి చేయాలి

VijayaBhaskar · May 24, 2026
Spread the love

పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధ‌వ్

శ్రీ స‌త్య సాయి జిల్లా : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంస్థ బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీ‌ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్’లో భాగంగా సత్యసాయి జిల్లాలోని శిక్షణ విభాగంలో పాల్గొని, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయుల ‘అంత్యోదయ’ తత్వం, జాతీయవాద భావజాలం, సేవా సూత్రం గురించి వివ‌రించారు పీవీఎన్ మాధ‌వ్.

అలాగే సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యకర్తలు పని చేయాల్సిన ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా వివరించారు. సంస్థ బలోపేతం, సామాజిక సేవ, జాతీయ అభివృద్ధి దిశగా ప్రతి కార్యకర్త అంకితభావంతో ముందుకు సాగాలని కోరారు. సేవ‌, నిబ‌ద్ద‌త‌, అంకిత భావం అనేది నేత‌లు, కార్య‌క‌ర్త‌లకు ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు పీవీఎన్ మాధ‌వ్. వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు.