ఆయిల్ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో స‌ర్కార్ ఫెయిల్

మోదీ, చంద్ర‌బాబుపై భ‌గ్గుమ‌న్న ష‌ర్మిలా రెడ్డి

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. యుద్దం బూచి చూపి దేశ ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా దోచుకుంటున్నారంటూ కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని, అదానీ, అంబానీల‌పై భ‌గ్గుమ‌న్నారు . దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆయిల్ ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంలో ఘోరంగా వైఫల్యం చెందింద‌ని ఆరోపించారు. నాలుగవ సారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.19 పైసలు ఉండ‌గా డీజిల్ లీటర్ ధర రూ. 104.88 పైసలు అమ్ముతుండ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఇంధనపు ధరలు అధికం గా ఉన్నాయ‌న్నారు.

రాష్ట్ర ప్రజలపై మోడీ సర్కార్ భరించారని భారం మోపుతుంటే బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడు మౌనంగా ఉండ‌డం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు ష‌ర్మిలా రెడ్డి. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టింపు లేక పోవడం బాధాకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మళ్లీ డిమాండ్ చేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలోనైనా అధికంగా వసూలు చేస్తున్న రూ. 4 వ్యాట్ ను , రూ. 1 రోడ్ సెస్ ను రద్దు చేయాల‌ని పేర్కొన్నారు. ఇంధన ధరలపై కొంతమేరకు ఉపశమనాన్ని కల్పించాల‌ని కోరారు ష‌ర్మిలా రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *