రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు చేయ‌డం లేదు

నిజ‌మేన‌ని క్ష‌మాప‌ణ చెప్పిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌మ సీఎం అబ‌ద్దాలు చెబుతున్నాడ‌ని, నిజంగానే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డం లేద‌ని ఒప్పుకున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు . ధాన్యం కొనుగోలులో జరిగిన లోపాలకు తాను బేష‌ర‌తుగా క్షమాపణలు చెపుతున్నాన‌ని, త‌న‌ను మ‌న్నించాల‌ని కోరారు కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి, చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతుల కోసం కేటాయించిన ప్రైవేటు గోదామును సందర్శించారు. ధాన్యం కొనుగోలు జరగనందుకు ఎమ్మెల్యే క్షమాపణలు కోరారు. రైతుల కష్టాలు వాస్తవ‌మేన‌ని , ఇందులో ఎలాంటి దాప‌రికం లేద‌న్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందన్నది నిజం అన్నారు. తాను కూడా అంగీకరిస్తున్న‌ట్లు తెలిపారు.. దీనిపై మేము కూడా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇక నుంచి వారి ధాన్యాన్ని వెంట‌నే కొనుగోలు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. ‘

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *