పోలవరం ప్రాజెక్ట్ ను ప‌రిశీలించిన సీఎస్ఆర్ఎస్

2027 నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించిన సీఎం

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం లోని పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు ఇవాళ‌ కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే ఉన్నారు. వీరు గ్యాప్ 1 ప్రాంతంలో ఏడు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగిస్తున్న, మట్టి, పదార్ధాలు, రాళ్లు అన్ని నాణ్యతగా ఉన్నాయని తేలింది. ఈ పరీక్ష నిర్వహించటానికి ఏడు గంటల సమయం పడుతుంది.

ఇదే తరహా పరీక్షలు గ్యాప్ 2 లో ఈ బృందం నిర్వహించనుంది. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ డి ఈ లు శ్రీకాంత్, విజయ్ కుమార్, ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య ఉన్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఏడాది 2027 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈమేర‌కు ఆయ‌న ప‌లుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లారు. నిధులు మంజూరు చేయాల‌ని కోరారు. ఇందుకు గాను కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *