ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ అరెస్ట్ పై ప‌వ‌న్ కామెంట్స్

కేసు న‌మోదు చేశారని, ఇక వ‌దిలేయండి

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్నంతా పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్సీ, ప్ర‌ముఖ ఎన‌లిస్ట్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు వ్య‌వ‌హారం. ఆయ‌న జ‌న‌సేన పార్టీ గురించి, ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ గురించి చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. చివ‌ర‌కు ఆయ‌న‌పై కేసు కూడా న‌మోదు చేసేంత దాకా వెళ్లింది. అయితే నాగేశ్వ‌ర్ రావును అరెస్ట్ చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన పోలీసులు తెలంగాణ‌కు రానున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లుగుతుంద‌ని ఖాకీల‌ను నాగేశ్వ‌ర్ రావు ఇంటి ముందు మోహ‌రించారు.

దీనిపై స్పందించారు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్. త‌న‌పై ఆన్ లైన్ వేదిక‌గా ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ మేర‌కు స్వ‌యంగా డీజీపీ సీవీ ఆనంద్ ను క‌లిసి ఫిర్యాదు చేశారు. ఇదే స‌మ‌యంలో ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ రావు అంశంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే త‌న‌పై కేసు న‌మోదు చేశార‌ని, త‌న‌ను అరెస్ట్ చేయాలంటూ వ‌స్తున్న ఒత్తిడిని తాను అర్థం చేసుకోగ‌ల‌న‌ని, తాను ఎలా చెబుతానంటూ తిరిగి ప్ర‌శ్నించారు. అది జ‌రిగి పోయిన వ్య‌వ‌హారం, ఇక వ‌దిలి వేయాల‌ని కోరారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *