త‌ర త‌రాల‌కు త‌ర‌గ‌ని స్పూర్తి ఎన్టీఆర్

ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు

అమ‌రావ‌తి : తెలుగు జాతి ఉన్నంత వ‌ర‌కు దివంగ‌త , ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌తికే ఉంటాడ‌ని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. మే 28న ఎన్టీఆర్ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌నను స్మ‌రించుకున్నారు. ఘ‌నంగా నివాళులు అర్పించారు.ప్రపంచానికి తెలుగుజాతి ఖ్యాతిని చాటిచెప్పిన‌ విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని సేవ‌లు స్మ‌రిస్తూ నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు లోకేష్‌.

తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వంగా తెలుగుదేశం పార్టీ ప‌తాకాన్ని ఎగుర వేశారని కొనియాడారు. అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా ప‌సుపు జెండాని నిల‌బెట్టార‌ని అన్నారు. మ‌హిళా సాధికార‌త‌కు బాట‌లు వేశారు. ప్ర‌జ‌ల కోసం..ప్ర‌గ‌తి కోసం తెలుగుదేశం పార్టీని అంకితం చేశారు. సంక్షేమానికి చిరునామా అయ్యారు. అన్నా అంటే నేనున్నానంటూ ఆదుకున్నారు. కోట్లాది హృద‌యాల్లో కొలువైన మ‌ర‌ణంలేని మ‌హా మ‌నిషి ఎన్టీఆర్‌కు జోహార్లు. తాతా..మీరే తెలుగు ప్ర‌జ‌ల కీర్తి..మీరే మాకు నిత్య‌నూత‌న స్ఫూర్తి అని పేర్కొన్నారు నారా లోకేష్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *