అరుదైన నాయ‌కుడు సిద్ద‌రామ‌య్య : భ‌వ్య మూర్తి

రాజ‌కీయాల‌లో ఇలాంటి నేత‌లు చాలా అరుదు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు సిద్ద‌రామ‌య్య‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న త‌ప్పుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీనియ‌ర్ నాయ‌కురాలు భ‌వ్య న‌ర‌సింహ మూర్తి. సదా నా నాయకుడు, నా గురువు.నా ఆదర్శం ఆయ‌నేన‌ని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి, తన స్వచ్ఛమైన పరిపాలన ద్వారా రాజకీయాల్లో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిన మహనీయుడు సిద్ద‌రామ‌య్య అని ప్ర‌శంసించారు భ‌వ్య‌. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. సాధారణ కుటుంబం నుంచి ఎదిగి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేసి ప్రత్యేకత‌ను చాటుకున్నార‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా సిద్ద‌రామ‌య్య 12 ఆగస్టు 1948లో పుట్టారు. న్యాయ‌వాది, లెక్చ‌ర‌ర్ గా కూడా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మొదట జనతా దళ్‌లో రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. 2013లో మొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రిగా అయ్యారు. 2013–2018 మధ్య పూర్తి 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసిన అరుదైన సీఎంగా నిలిచారు .సిద్ధరామయ్య ప్రభుత్వానికి “భాగ్య” పథకాలు ప్రసిద్ధి. అన్న భాగ్య‌, క్షీర భాగ్య‌, విద్యా సిరి, రైతు సంక్షేమ ప‌థ‌కాలు ముఖ్యంగా ఉన్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *