క‌డ‌ప జిల్లాలో కుండ‌పోత వ‌ర్షం

ఎక్క‌డిక‌క్క‌డ విరిగి ప‌డిన చెట్లు

క‌డ‌ప జిల్లా : భారీ వ‌ర్షాలు, ఈదురు గాలుల దెబ్బ‌కు క‌డ‌ప జిల్లా వ‌ణికి పోయింది. ఎడ తెరిపి లేకుండా వ‌ర్షాలు కురియడంతో పెద్ద ఎత్తున పంట‌ల‌ను కోల్పోయారు రైతులు. దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జిల్లా క‌లెక్ట‌ర్ కు ఫోన్ చేశారు. ప‌రిస్థితి పై ఆరా తీశారు. వివ‌రాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉండ‌గా న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా క‌డ‌ప జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు,మైదుకూరు ప్రాంతాల్లో భారీగా కురిసింది వ‌ర్షం.

గత రెండు రోజుల కిందట భారీ వర్షం కారణంగా జమ్మలమడుగు ప్రాంతంలో ఆగిపోయిన విద్యుత్ స‌ర‌ఫ‌రా. దీంతో ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డ్డారు. తాగు నీరు లేక పోవ‌డంతో ప‌ట్ట‌ణ వాసులు తాగేందుకు నీళ్లు అంద‌క నానా తంటాలు ప‌డ్డారు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నేటి వర్షం కారణంగా కొనసాగనున్న విద్యుత్ కొరత. తీర ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. అత్యంత అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *