ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆట‌లు ఇక్క‌డ సాగ‌వు

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్ : మ‌రోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌కు చెందిన మేధావులు, ప్ర‌జాస్వామిక‌వాదులు, క‌ళాకారులు, క‌వులు, అమ‌రవీరుల కుటుంబాలు, జ‌ర్న‌లిస్టులు సైతం భ‌గ్గుమంటున్నారు. ఇటీవ‌ల మాజీ ఎమ్మెల్యే నాగేశ్వ‌ర్ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. ఈ త‌రుణంలో పోలీసులు కేసు నమోదు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ సంద‌ర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ తాజాగా చేసిన కామెంట్స్ ప‌ట్ల మండిప‌డ్డారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

పవన్ కళ్యాణ్ బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని, ఇక్కడ తన నటనను ప్రారంభించారని ఆరోపించారు. ఒకవేళ ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యుంటే, అక్కడ ఆయనకు నచ్చినట్లుగా వ్యవహరించ గలిగేవారని అన్నారు. కానీ తెలంగాణలో తాను ఏమైనా చేస్తానంటే, దాన్ని సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణపై విషం చిమ్మే పవన్ కళ్యాణ్, ‘నవ నిర్మాణ’ పేరిట ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *