ఇప్ప‌ట్లో ఉద్యోగాలు ఇవ్వ‌లేం : బుర్రా వెంక‌టేశం

20 జాబ్స్ కోసం 19,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి

హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి బాగో లేద‌ని, అందుకే ఎక్కువ‌గా జాబ్స్ భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్లు ఇవ్వ‌లేమంటూ బాంబు పేల్చారు. నిరుద్యోగుల‌కు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. కేవలం 0.1% నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమ‌న్నారు బుర్రా వెంక‌టేశం.

ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 19,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజం అని చెప్ప‌డం ప‌ట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వ‌లేని సంస్థ ఉండీ ఏం లాభ‌మ‌ని ప్ర‌శ్నించారు. అయితే విచిత్రం ఏమిటంటే ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను మీడియా నియంత్రించాల‌ని సూచించారు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్. దీంతో ఇక జాబ్స్ భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *