పెళ్లికి సీఎం విజ‌య్ ని ఆహ్వానించిన ఖుష్బు

VijayaBhaskar · June 3, 2026
Spread the love

త‌మ జీవితంలో మ‌రిచి పోలేని రోజన్న న‌టి

చెన్నై : ప్ర‌ముఖ న‌టి, భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు ఖుష్బు సుంద‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబంతో విడ‌దీయ‌లేని బంధం టీవీకే పార్టీ చీఫ్‌, అగ్ర న‌టుడు , ద‌ళ‌ప‌తి విజ‌య్ తో ఉంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే సీఎంగా కొలువు తీరిన విజ‌య్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా అరుదైన‌, కుటుంబానికి సంబంధించిన ఫోటోల‌ను పంచుకున్నారు ఖుష్బు సుంద‌ర్. మా కుటుంబానికి ఇది నిజంగా ఒక అత్యంత విశేషమైన, చిరస్మరణీయమైన రోజు అని పేర్కొన్నారు. మా ప్రియ సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ నివాసంలో త‌న‌ను కలుసు కోవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

శ్రవణ్ శ్రీనివాసన్‌తో త‌మ‌ కుమార్తె వివాహానికి ఆహ్వానం అందించడం ఆనందంగా ఉంద‌న్నారు. త‌న‌ను చూడటం ఎల్లప్పుడూ మా హృదయాలను గర్వంతో , ఆనందంతో నింపి వేస్తుందన్నారు. పిల్లలు పరమానంద భరితులై పోయారని పేర్కొన్నారు ఖుష్బు సుంద‌ర్. వారి చూపులు ఆయనపై నుండి అస్సలు తొలగ లేద‌న్నారు. తన దైనందిన కార్యక్రమాలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తాము ఎల్లప్పుడూ అమితంగా ఆదరించే ఆప్యాయత, అనురాగం, చిరునవ్వుతో విజ‌య్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించ‌డం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు.