ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో చేర‌నున్న రిష‌బ్ పంత్

VijayaBhaskar · June 3, 2026
Spread the love

త‌న‌పై వేటు వేయ‌నున్న ల‌క్నో మేనేజ్మెంట్

న్యూఢిల్లీ : భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యారైంది. త‌ను ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దారుణంగా వైఫ‌ల్యం చెందాడు. భారీ ధ‌ర‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. కానీ ఆశించిన మేర నాయ‌కుడిగా రాణించ‌లేదు. ఇక ఆట‌గాడిగా త‌న‌దైన ముద్ర‌ను వేయ‌య‌లేక పోయాడు. ఇదే స‌మ‌యంలో భారీ ధ‌ర‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నుంచి ట్రేడ్ ప‌రంగా సీఎస్కే మేనేజ్మెంట్ త‌న‌ను తీసుకుంది. తీసుకున్నందుకు గాను త‌ను క‌నీసం 400కు పైగా ప‌రుగులు సాదించాడు. ఇందులో రెండు సెంచ‌రీలు కూడా ఉన్నాయి.

ఇదే రిష‌బ్ పంత్ విష‌యానికి వ‌స్తే అత్యంత దారుణంగా ఆడాడు. త‌ను ఒకే ఒక్క హాఫ్ సెంచ‌రీ మాత్ర‌మే చేశాడు. దీంతో త‌న‌పై కోట్లు ఖ‌ర్చు చేసినందుకు త‌ల ప‌ట్టుకోవాల్సి వ‌చ్చింది రిషబ్ పంత్ వ్య‌వహారానికి సంబంధించి. ఇక త‌న‌ను వ‌దిలించు కోవాల‌ని డిసైడ్ అయ్యింది. ఇప్ప‌టికే త‌న‌ను తీసి వేస్తున్న‌ట్లు రిష‌బ్ పంత్ కు అర్థ‌మైంది. అయితే ఎప్ప‌టి నుంచో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న‌ను తీసుకోవాల‌ని చూస్తోంది. ఇక రాబోయే ఐపీఎల్ 20 మెగా టోర్నీలో త‌ను ఢిల్లీ త‌ర‌పున జెర్సీ ధ‌రించేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు టాక్. మొత్తంగా ఇరు జ‌ట్ల యాజ‌మాన్యాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగితే త‌ను వెళ్లి పోవ‌డం ఖాయం.