ఏపీలో సుప‌రిపాల‌న‌కు రెండేళ్లు : జ‌నార‌ర్ద‌న్ రెడ్డి

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి

అమ‌రావ‌తి : ఏపీ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సంక్షేమం – అభివృద్ధితో కూడిన సుపరిపాలనకు రెండేళ్లు పూర్తయింద‌ని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమ, అభివృద్ధే ధ్యేయంగా కూటమి పాలన సాగుతోంద‌ని అన్నారు. మంత్రి గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా రహదారుల అభివృద్ధి పనులు చేప‌డుతున్నామ‌న్నారు.

ఈ ఏడాది చివరి నాటికి 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయ‌ని వెల్ల‌డించారు. చంద్రబాబు సమర్థ, సుస్థిర పాలనతో పెట్టబడిదారుల్లో విశ్వాసం మ‌రింత పెరిగింద‌న్నారు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో దేశంలోనే అగ్రగామిగా 25 % పెట్టుబడులు సాధిస్తూ, పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింద‌న్నారు. పెట్టుబడుల రాకతో, పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయ‌న్నారు మంత్రి. రాష్ట్రంలో భయాందోళనలు లేని, ప్రశాంతమైన ప్రజాస్వామ్య పాలనకు రెండేళ్లు పూర్తి చేసుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *