కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు

రూ. 10 వేల కోట్ల ఏటీఎఫ్ స్థిరీక‌ర‌ణకు ఓకే

న్యూఢిల్లీ : ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోదం తెలిపింది. విమాన‌యాన రంగానికి సంబంధించి ఏటీఎఫ్ ధ‌ర స్థిరీక‌ర‌ణ నిధికి రూ. 10 వేల కోట్లు మంజూరు చేసేందుకు ఓకే చెప్పంది. ఇంధన ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడం దీని లక్ష్యం. పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ATF ధరలు 2.5 రెట్లు పెరిగాయి. ATF ధర లీటరుకు ₹60.5 (మార్చి-26 నాటికి) నుండి ₹142 (మే-26 నాటికి)కి పెరిగిందిఅంతే కాకుండా Delhi-NCR కోసం ₹5,041 కోట్లకు ఆమోదం తెలిపింది మంత్రివ‌ర్గం. పాత BS-I నుండి BS-IV శ్రేణి ట్రక్కులు, బస్సుల మార్పిడిని లక్ష్యంగా చేసుకుంది. 1.9 లక్షలకు పైగా ట్రక్కులు ,16,000 బస్సులను ఈ పథకం పరిధిలోకి తెస్తుంది.

BS-VI మరియు విద్యుత్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుకు కూడా కేబినెట్ ప్ర‌యారిటీ ఇచ్చింది. తెలంగాణలో రహదారుల నిర్మాణం చేప‌ట్టేందుకు రూ. 7,597 కోట్ల‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా జాతీయ ర‌హ‌దారుల 4 లేన్ల విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నుంది. బీహార్ లో ర‌హ‌దారుల కోసం రూ. 8,936 కోట్లు, ఒడిశా తీర ప్రాంత ర‌హ‌దారి కోసం రూ. 8,301 కోట్లకు ఆమోదించింది కేబినెట్. మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం కోసం రూ. 4,415 కోట్ల‌కు ఓకే చెప్పింది. ర‌హ‌దారి ప్రాజెక్టుల కోసం రూ. 29,000 కోట్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *