కూట‌మి నేత‌ల‌కు తెలంగాణ‌లో ఏం ప‌ని..?

నిప్పులు చెరిగిన శాస‌న మండ‌లి చైర్మ‌న్

హైద‌రాబాద్ : ఏపీ కూట‌మి నేత‌లు నారా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, నారా లోకేష్ , త‌దిత‌ర నేత‌ల తీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉండాల్సిన కూట‌మి నేత‌ల‌కు ఇక్క‌డ ఏం ప‌ని అని నిల‌దీశారు. హైద‌రాబాద్ లో కాదు ఉండాల్సింది మీరు వెళ్లాల్సింది, అమ‌రావతి మీ ప్రాంత‌మ‌ని అక్క‌డే ఉండాల‌ని ఇక్క‌డికి వ‌చ్చి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తామంటే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు పారేసు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకునే ర‌కం కాద‌ని, అది తెలుసుకుంటే మంచిద‌న్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహారంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీరియ‌స్ గా స్పందించారు. నిప్పులు చెరిగారు త‌న కామెంట్స్ పై. ఆంధ్ర నాయకులు ఏపీ, తెలంగాణల మధ్య తరచూ రాకపోకలు సాగించడం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. వారు తెలంగాణను పక్కన పెట్టి, ఏపీ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *