స్టూడెంట్స్ కు త‌మిళ‌నాడు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంద‌రికీ ఉచిత బ‌స్ పాస్

చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంద‌రికీ ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాను ప‌డిన క‌ష్టాల‌ను ఆయ‌న ఇత‌ర విద్యార్థులు ఎవ‌రూ ప‌డ‌కూడ‌ద‌ని పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ప్ర‌క‌టించారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ విధమైన వెసులు బాటును కల్పిస్తుంది. పాఠశాలలు , కళాశాలలు తిరిగి తెరిచినప్పుడు, కొత్త స్మార్ట్ బస్ పాస్‌లు జారీ కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ లోపు విద్యార్థులు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిబంధనల ప్రకారం పాఠశాల విద్యార్థులు స్కూల్ యూనిఫాం ధరించి లేదా తమ పాత బస్ పాస్/గుర్తింపు కార్డు (ID Card) చూపించి ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తమ విద్యా సంస్థలు జారీ చేసిన ప్రస్తుత లేదా పాత గుర్తింపు కార్డులను (ID Cards) చూపిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్. కొత్త బస్ పాస్‌ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు విద్యార్థులందరికీ రవాణా సౌకర్యం సజావుగా సాగేలా చూడాలని ఆదేశించింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *