బొద్దింక‌ల జ‌నతా పార్టీ నిర‌స‌న కేంద్రంపై ఆందోళ‌న

సీజేపీ అధ్య‌క్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సార‌థ్యంలోని బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ (సీజేపీ) శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జాస్వామిక వాదులు, స్వ‌చ్చంద సేవ‌కులు, పౌర స‌మాజం, పౌర హ‌క్కుల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇందులో స్వ‌చ్చంధంగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా సీజేపీ నేత‌లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యమాలు, ధర్నాలు, నిరసనలు , ర్యాలీలు నిర్వహించడం వల్ల ఏం సాధిస్తారని ప్రజలు అడుగుతుంటారని అన్నారు. అవి మనం సజీవంగా ఉన్నామని నిరూపిస్తాయని పేర్కొన్నారు . ప్రభుత్వ దృష్టిలో మనం కేవలం పురుగులమంత అల్పమైన వారమే కావచ్చు, కానీ మనం ఇంకా ఉనికి కోల్పోలేద‌ని సజీవంగా ఉన్నాం అని తెలియ చేస్తుంద‌న్నారు. అంతే కాదు మన హక్కుల కోసం పోరాడగల సామర్థ్యం మనకు ఉంద‌ని ప్ర‌క‌టించేందుకు ఇది వీలు క‌ల్పిస్తుంద‌న్నారు సీజేపీ చీఫ్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *