సీబీఎస్ఈ లోపాల‌ను బ‌య‌ట పెట్టిన సార్థ‌క్

అభినందించిన ఎంపీ రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : సీబీఎస్ఈ – ఓఎస్ఎం లోని లోపాల‌ను బ‌య‌ట పెట్టాడు ధైర్యంగా 18 ఏళ్ల సార్థ‌క్ . ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. త‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు రాహుల్ గాంధీ. దీనిని ప్రభుత్వంపై యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కేవలం “రీల్స్” చేయడంలో నిమగ్నమై, ప్రశ్నలు అడగకుండా ఉండాలని కోరుకుంటారని, కానీ ఈ విద్యార్థులు వ్యవస్థను సవాలు చేసి సమాధానాలను కనుగొన్నారని గాంధీ పేర్కొన్నారు.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , సర్వీస్ ప్రొవైడర్ మధ్య ఉన్నట్లు ఆరోపించ బడుతున్న కుమ్మక్కును బయట పెట్టినందుకు సార్థ‌క్ ను, త‌న స‌హ‌చ‌రుడు నిస‌ర్గ‌ల‌ను ప్ర‌శంసించారు.

వారి కృషిని యువత విజయంగా , ప్రభుత్వానికి ఓటమిగా ఆయన అభివర్ణించారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలలో ఉపయోగించే ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలోని లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన సార్థక్, ప్రధాన మీడియా సంస్థలు, పరిశోధనాత్మక జర్నలిస్టులు వెలికి తీయడంలో విఫలమైన అంశాలను వెలుగులోకి తీసుకు రాగలిగారు. దేశంలోని పెద్ద మీడియా సంస్థలు, పరిశోధనాత్మక జర్నలిస్టులు చేయలేని పనిని వీరు చేయ‌గ‌ల‌గ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు రాహుల్ గాంధీ. మోదీ మన యువత కేవలం రీల్స్ చేస్తూ, పకోడీలు వేస్తూ, ప్రశ్నలు అడగకుండా, కళ్లు తెరవకుండా ఉండాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *