రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ

ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ముగ్గురు స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఎంపికైన వారిలో సానా స‌తీష్ , చింత‌కాయ‌ల విజ‌య్ , భాష్యం రామ‌కృష్ణ ఉన్నారు. కూటమికి సంబంధించి అవకాశమున్న మొత్తం నాలుగు సీట్లలో ఒకటి జనసేనకు మూడు టీడీపీ కి కేటాయించారు. మ‌రో వైపు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల బిల్లు చట్ట సభల్లో పెండింగ్ లో ఉన్నప్పటికీ.. తాము చేతల్లో రిజర్వేషన్లను అమలు చేసి చూపిస్తామని టీడీపీ అధినేత గొప్పగా ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు.

రాజ్యసభ సీట్ల కేటాయింపులో మహిళలకు ఒక స్థానాన్ని కేటాయించి తద్వారా మూడింటిలో ఒకటి.. అంటే ముప్పై మూడు శాతం అమలు చేసినట్లు అవుతుందని టీడీపీ నేతలు ప్రచారం కూడా చేశారు .కానీ ఆచరణలో విఫలమయ్యారు . మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో మాట తప్పారనే అపవాదును టీడీపీ మూట కట్టుకున్నట్లయిందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *