అర‌వింద్ కేజ్రీవాల్ తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ

దేశంలో రాజ‌కీయ ప‌రిణామాల‌పై విస్తృత చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైన అనంత‌రం ఉన్న‌ట్టుండి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ప్ర‌త్య‌క్షం అయ్యారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ, దీదీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ తో క‌లిసి నేరుగా ఆప్ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. వీరు గంట‌కు పైగా స‌మావేశం కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది. ఈ సంద‌ర్బంగా భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ గురించి చ‌ర్చించారు. స‌ర్ పేరుతో ఓటర్ల‌ను జాబితాల నుండి తొల‌గించ‌డంపైనే పెద్ద ఎత్తున చర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం పేరుతో కేజ్రీవాల్ ను జైలు పాలు చేశారు. త‌న‌కు అనుంగు అనుచ‌రుడిగా పేరు పొందిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరేలా చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు క‌మ‌లనాథులు. త్వ‌ర‌లో బెంగాల్ లో క‌మ‌లం అధికారంలోకి వ‌చ్చిన‌ట్లుగానే పంజాబ్ లో కూడా సైలెంట్ ఆప‌రేష‌న్ చేప‌ట్టేందుకు రెడీ అయ్యింది. ఈ త‌రుణంలో మాజీ సీఎంలు దీదీ, కేజ్రీవాల్ లు క‌లిసి స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *