త‌మిళ సినీ రంగానికి భార‌తీరాజా దిక్సూచి

VijayaBhaskar · June 11, 2026
Spread the love

ప‌ల్లెత‌న‌పు జ్ఞాప‌కాల‌ను ఆవిష్క‌రించిన డైరెక్ట‌ర్

చెన్నై : భారతీయ చలనచిత్ర రంగం తన గొప్ప కథకులలో ఒకరైన #భారతీరాజాని కోల్పోయింది. గ్రామీణ జీవన సౌరభం, మానవ సంబంధాల అందం, ప్రేమలోని స్వచ్ఛత, సామాన్యుల భావోద్వేగాలను ఆయన అద్భుతమైన దృశ్య కావ్యాలుగా మలిచారు. ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకాయి ఎన్నో తరాల సినీ సృష్టికర్తలకు స్ఫూర్తినిచ్చాయి. ప్రతిష్టాత్మక పద్మశ్రీ , అనేక జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్న భారతీరాజా సేవలు భారతీయ సినిమాకు వెల కట్టలేనివి.

‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం నాకు లభించింది. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, సరళత, పని పట్ల ఆయనకున్న నిబద్ధత నాపై చెరగని ముద్ర వేశాయి. భారతీరాజా మధ్య లేకపోయినా, అద్భుతమైన చిత్రాల ద్వారా ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచి పోతుంది . “ఇయక్కునర్ ఇమయం” (దర్శక దిగ్గజం) భారతీరాజా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను.