newsseals.com
News

స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

VijayaBhaskar June 11, 2026
newsseals-YSJagan
Spread the love

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్

అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించ‌చారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అర్హులైన క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక కాలేద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. బాల్ బ్యాడ్మింటన్‌ ఆటలో 48 మంది, ఖోఖోలో 49 మంది., జూడోలో 39 మంది, సాఫ్ట్‌బాల్‌లో 38 మంది, ఫెన్సింగ్‌లో 13 మంది ఉద్యోగాలు వచ్చాయ‌న్నారు.

సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టీడీపీ ఎమ్మోల్యే కూన రవికుమార్ , జూడో అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ ఎంపీ భరత్ ఉన్నార‌ని ఈ పోస్టుల కేటాయింపుల అక్రమాల‌లో వీరి ప్ర‌మేయం ఉంద‌ని ఆరోపించారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్ సాధించిన క్రీడాకారుడికి మాత్రం ఉద్యోగం రాలేద‌ని దీనిపై సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ పోస్టుల‌ను ఎంత మొత్తానికి అమ్ముకున్నారో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పాల‌న్నారు.