ప‌ద్మ‌శ్రీ‌ని తిర‌స్క‌రించిన దిగ్గ‌జ ద‌ర్శకుడు

VijayaBhaskar · June 11, 2026
Spread the love

త‌మిళుల కోసం గొంతు వినిపించిన భార‌తీ రాజా

చెన్నై : త‌మిళ నేల మీద పుట్టిన అరుదైన వ్య‌క్తి, మ‌హ‌ర్షి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భారతీ రాజా. ఆయ‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు ఈ ప్రాంతం గురించి, ప్ర‌జ‌ల బాగోగుల గురించి ఆలోచించాడు. వారి త‌ర‌పున త‌న గొంతుక‌ను వినిపించారు. శ్రీ‌లంక‌లో త‌మిళులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై త‌ను నిన‌దించాడు. శ్రీలంక తమిళుల దుస్థితి పట్ల కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని భావించి జరిగిన నిరసనల్లో సైతం పాల్గొన్నారు. 2009లో జ‌రిగిన ఆనాటి శ్రీలంక తమిళ సమస్య సమయంలో వార్తల్లో నిలిచారు. త‌ను చ‌రిత్ర సృష్టించారు.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా అరుదైన వ్య‌క్తిత్వం క‌లిగి ఉన్నారు. ఆయ‌న సినిమా రంగానికి చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా కేంద్ర ప్ర‌భుత్వం అత్యున్న‌త‌మైన పుర‌స్కారాన్ని ప్ర‌దానం చేసింది. ఇదే క్ర‌మంలో త‌మిళుల ఆత్మ గౌర‌వం ఇనుమ‌డింప చేసేలా ప్ర‌య‌త్నం చేశారు. 2004లో భారత ప్రభుత్వం తనకు ప్రదానం చేసిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తానని భారతీరాజా ప్రకటించారు. ఆ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు.