డీజీపీని క‌లిసిన మంద‌కృష్ణ మాదిగ‌

సీవీ ఆనంద్ కు ఎంఆర్పీఎస్ చీఫ్ కంగ్రాట్స్

హైద‌రాబాద్ : తెలంగాణ నూత‌న డీజీపీగా కొలువు తీరిన సీవీ ఆనంద్ ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) అధ్య‌క్షుడు , ప‌ద్మ‌శ్రీ మంద‌కృష్ణ మాదిగ‌. ఈ సందర్భంగా C.V ఆనంద్ కి మంద కృష్ణ మాదిగ పుష్పగుచ్చం అందించి , శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ సందర్భంగా MRPS మొదటి దశ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా బషీర్ బాగ్ చౌరస్తాలో పోలీసు అధికారిగా విధులు నిర్వర్తించిన విషయాన్ని C.V ఆనంద్ గుర్తు చేసుకున్నారు.

పోలీసు శాఖలో అపారమైన అనుభవం కలిగిన C.V ఆనంద్ తెలంగాణ రాష్ట్ర DGP గా నియమితులు కావడం సంతోషకరమని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ, MSP జాతీయ నేత తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ప్రముఖ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ , సినిమా దర్శకులు ప్రేమ్ రాజు, MSF రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *