చంద్రబాబు తోనే రాయలసీమ అభివృద్ధి

స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఒకప్పుడు కరువు కాటకాలకు రాయలసీమ పేరుగాంచిందని, సీఎం చంద్రబాబు రాకతో రతనాల సీమగా మారిందని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత అన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా, పారిశ్రామిక హబ్ గా, డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమతో పాటు రాయల్ ఇన్ ఫీల్డ్ ద్విచక్ర వాహన కంపెనీని సైతం సీఎం చంద్రబాబు నాయుడు ఇమేజ్ తోనే ఏర్పాట్టాయన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గానూ అభివృద్ధి చేస్తున్నామన్నామన్నారు స‌విత‌. రాయలసీమ గురించి జగన్ మాట్లాడడం సిగ్గుగా ఉంద‌న్నారు.

వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రాస్ జగన్ రెడ్డి అని మంత్రి సవిత మండిపడ్డారు. కట్టుకున్న తల్లిని, తోడపంచుకుని పుట్టిన చెల్లికి జగన్ తీవ్ర అన్యాయం చేశారని మంత్రి సవిత మండిపడ్డారు. ఒకప్పుడు కరవుతో విలవిలలాడే రాయలసీమలో ఎన్నో పరిశ్రమలను స్థాపించామన్నారు. కృష్ణా జలాలను కుప్పానికి తీసుకెళ్లామన్నారు. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై జగన్ మరోసారి శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాయలసీమలో అన్నమయ్యా డ్యామ్ కొట్టుకుపోయిన సందర్బంలోనూ, విశాఖలో వివిధ పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల సమయంలో జగన్ వ్యవహరించిన తీరు ప్రజలకు తెలుసన్నారు. ఎంతో ఖరీదైన విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేయడానికి జగన్ పన్నని కుట్రలు అందరికీ తెలుసన్నారు. అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *