నేటి నుంచి తెలంగాణ‌లో ఇంటింటి స‌ర్వే

స‌ర్ ప్ర‌క్రియ‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న

హైద‌రాబాద్ : జ‌నాభా గ‌ణ‌న‌కు సంబంధించిన ఇంటింటి స‌ర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభ‌మైంది. ఈ స‌ర్ స‌ర్వే వ‌చ్చే నెల జూలై 24 వ‌ర‌కు కొన‌సాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,38,25,448 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్నారు BLO లు. హైదరాబాద్ లో ఇంగ్లీష్ లో, మిగత జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందజేస్తారు. మొత్తం 119 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 35 వేల 985 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఫ్యామిలి మ్యాపింగ్ 2,38,62,322 ఉండ‌గా అన్ మ్యాపింగ్ 99,64,126 ఓట‌ర్లు ఉన్నారు. మొత్తంగా సేక‌రించిన స‌ర్వే ఆధారంగా ముసాయిదా జాబితాను జూలై 31న ప్ర‌చురించున్న‌ట్లు ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సీఈఓ వెల్ల‌డించారు.

త‌మ ఓటుకు సంబంధించి ఏవైనా అనుమానాలు కానీ లేదా అభ్యంత‌రాలు ఉన్న‌ట్ల‌యితే జూలై 31 నుంచి ఆగ‌స్టు 30వ తేదీ వ‌ర‌కు స్వీక‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. బీఎల్ ఓలు , ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ప్పుడు పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని కోరారు. లేక పోతే మీకే ఇబ్బంది అవుతుంద‌ని పేర్కొన్నారు. సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు గాను జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వ‌ర‌కు గ‌డువు విధించామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *