ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం పర్యటన
ఇవాల్టి నుంచి ప్రారంభమైన చంద్రబాబు టూర్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే పరిపాలనా పరంగా అపారమైన అనుభవం కలిగిన ఆయన విస్తృతంగా పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తనదైన శైలిలో పాలన సాగిస్తూ కింది స్థాయి నుంచి పై స్తాయి వరకు అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ఏపీని అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఏపీలో కొలువు తీరాక తనదైన ముద్రతో విజన్ ను ఆవిష్కరించారు. అందుకు అనుగుణంగా పాలసీలను తీసుకు వచ్చారు. ఫార్మా, ఐటీ, పర్యాటక, పారిశ్రామిక తదితర రంగాలలో ఏపీ ముద్ర కనిపించేలా ఫోకస్ పెట్టారు. అంతే కాకుండా 175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
పాలనా పరంగా మరింత పారదర్శకంగా ఉండేందుకు చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించేలా చూస్తున్నారు. ఇదిలా ఉండగా జూలై 1 నుంచి సీఎం రాష్ట్రంలోని ఐదు జిల్లాలలో పర్యటించేందుకు ప్లాన్ చేశారు. వివిధ జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా సీఎం నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని పున్నపువారిపాలెంలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం తిరుపతి జిల్లా సత్యవేడులో హీరో మోటార్స్ కు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. రూ.750 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్న హీరో మోటార్స్ సంస్థ. కాగా ఇవాళ రాత్రికి శ్రీసిటీలోనే బస చేయనున్నారు ముఖ్యమంత్రి. రేపు మంగంపేటలో వీబీ జీ రామ్ జీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.