ఏపీకి త‌ల‌మానికంగా కుప్పంను మారుస్తాం : సీఎం

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వ‌హిస్తూ వ‌స్తున్న కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని దేశంలోనే ఆద‌ర్శ ప్రాయంగా, రాష్ట్రానికి త‌ల‌మానికంగా నిలిపేందుకు కృషి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దేశం న‌లుమూల‌ల నుంచి ఉపాధి కోసం కుప్పంకు వ‌చ్చేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు దృష్టి సారిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా మూడు రోజుల పాటు కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

రైతులు, వివిధ పథకాల లబ్దిదారులు, ఉద్యోగులు, అధికారులు, పార్టీ నేతలు, పారిశ్రామిక వేత్తలతో మూడు రోజుల పాటు సీఎం వరుసగా సమావేశాలు నిర్వ‌హించారు. దశాబ్దాల నాటి కంగుంది రైతుల సమస్యకు పరిష్కారం చూపిన‌ట్లు చెప్పారు. .61 ఏళ్లుగా పెండింగులో ఉన్న భూ సమస్యకు పరిష్కారం చూపించ‌డం , ఇది త‌న హ‌యాంలో జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. రూ.9322 కోట్ల పెట్టుబడితో కుప్పానికి 30 పరిశ్రమలు తెచ్చేలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంఓయూలు కుదుర్చుకున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా జూలై 1 వ తేదీ నెల్లూరు జిల్లా గూడూరు పింఛన్ల పంపిణీ నుంచి నేటి వరకు 4 జిల్లాల్లో 6 రోజుల పాటు ప‌ర్య‌టించారు.

  • Related Posts

    టీపీబీఓపై సీఎంసీ కమిష‌న‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అంజయ్య నగర్ భవన కూల్చివేత ఘటన క‌ల‌క‌లం రేపింది. ఈ సంఘ‌ట‌నకు సంబంధించి సీఎంసీ క‌మిష‌న‌ర్ జి. శ్రీ‌జ‌న సీరియ‌స్ అఅయ్యారు. ఈ సంద‌ర్బంగా ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన టీపీబీఓపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఆగ‌స్టు 22న…

    ఇంపీరియ‌ల్ కాలేజీని సంద‌ర్శించిన సీఎం స‌ల‌హాదారు

    లండ‌న్ : తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన కె. రామకృష్ణారావు లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇంపీరియల్ కళాశాలను సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ , వ్యూహాత్మక అనుసంధాన విభాగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *