newsseals.com
ENTERTAINMENT

శ‌ర‌వేగంగా బాబీ మెగాస్టార్ మూవీ షూటింగ్

VijayaBhaskar July 7, 2026
newsseals-ChiranjeeviBobbyMovie

హైదారాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ ఫుల్ కాంబోగా గుర్తింపు పొందారు ద‌ర్శ‌కుడు బాబీ, మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో గ‌తంలో వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య బిగ్ స‌క్సెస్ అయ్యింది. చిరంజీవి సినీ కెరీర్ లో మ‌రిచి పోలేని విధంగా విజయాన్ని క‌ట్ట‌బెట్టింది. తాజాగా ఈ ఇద్ద‌రు క‌లిసి ఇంకా పేరు పెట్ట‌ని మూవీని తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. టేకింగ్ , మేకింగ్ లో త‌న‌దైన శైలికి పేరుంది బాబీకి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. మెగాస్టార్ సినీ రంగ‌గంలోకి వ‌చ్చి ఇప్ప‌టికి ఆయ‌న 157 సినిమాలు పూర్తి చేశారు. ఇప్పుడు బాబీతో 158 మూవీ చేస్తున్నారు. మెగాస్టార్ పుట్టినరోజున టీజర్ విడుదల లక్ష్యంగా సన్నాహాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్.

మెగాస్టార్ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తుండగా, వెంకట్ కె. నారాయణ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. తాత్కాలికంగా #Mega158 అని పిలువబడుతున్న ఈ ప్రాజెక్ట్, ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ చిత్రం తర్వాత చిరంజీవి , బాబీ మళ్లీ కలిసి పనిచేస్తున్న చిత్రం కావడం విశేషం. సమాచారం ప్రకారం, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ , ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది.