newsseals.com
SPORTS

హ్యాపీ బ‌ర్త్ డే మిస్ట‌ర్ కూల్ ధోనీ : విజ‌య్

VijayaBhaskar July 7, 2026
newsseals-CMVijay

చెన్నై : ఇవాళ భార‌త క్రికెట్ రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన జార్ఖండ్ డైన‌మెట్, మాజీ కెప్టెన్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు. జూలై 6న ఆయ‌న పుట్టారు. ఈ సంద‌ర్బంగా తామిద్ద‌రి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు మిస్ట‌ర్ కూల్ ధోనీకి త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్రశేఖ‌ర్. మీ పేరును మారుమోగే ప్రతి ఈల నుండి, మీరు స్ఫూర్తినిచ్చిన లెక్కలేనన్ని హృదయాల వరకు, మీ ప్రయాణం తమిళనాడు క్రీడా ప్రపంచంలో ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచి పోయింది అని ప్ర‌శంస‌లు కురిపించారు సీఎం.

మా ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అసాధారణ క్రికెట్ వారసత్వం, ప్రశాంతమైన నాయకత్వం, వినయ స్వభావం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖ‌ఖ‌ర్. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, మరెన్నో విజయవంతమైన సంవత్సరాలు రావాలని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. మీ కోసం ఈలలు మరింత బిగ్గరగా మ్రోగాలంటూ ఆకాంక్షించారు. కాగా ధోనీ, విజ‌య్ ఇద్ద‌రూ త‌మ త‌మ రంగాల‌లో కీల‌క‌మైన పాత్ర పోషించారు. కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చారు.