సీఎం సువేందుని ప్రశంసించిన సాయోని ఘోష్
కోల్ కతా : మాజీ ముఖ్యమంత్రి , టీఎంసీ పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి రోజు రోజుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న అదే పార్టీకి చెందిన ఎంపీ మహూవా మోయిత్రా సీఎం సువేందు అధికారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతే కాదు తాను కష్టకాలంలో ఉన్న సమయంలో తను ఎంతో సపోర్ట్ చేశారని ప్రశంసించారు. ఎన్నికల సందర్బంగా తను ఒక్కదానినే ప్రచారం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆమె చేసిన కామెంట్స్ దీదీకి చిర్రెత్తుకొచ్చేలా చేశాయి. ఈ తరుణంలో మరో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సాయోని ఘోష్ సంచలనంగా మారారు. తను పదే పదే టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు.
తాజాగా తను ముఖ్యమంత్రి సువేందు అధికారిని ప్రశంసలతో ముంచెత్తారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తను స్పందించారు. నేను సీఎం సువేందు అధికారితో మాట్లాడాను, బరుయిపూర్ కేసులో పరిస్థితిని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారని నాకు హామీ ఇచ్చారు. అరెస్టులు జరుగుతున్నాయి, ఒక సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేశారు. వారు బాధితురాలి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ సీఎం తనకు హామీ ఇచ్చారన్నారు. కాగా తక్షణమే అవసరమైన చర్యలు తీసుకున్నందుకు సీఎంకి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఎంపీ సయోని ఘోష్.