newsseals.com
News

కుల‌, మ‌తాల పేరుతో కుట్ర‌లు స‌హించం : మాధ‌వ్

VijayaBhaskar July 10, 2026
newsseals-PVNMadhav

అమ‌రావ‌తి : ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. యూట్యూబ‌ర్ ప్ర‌శ్న రావ‌ణ్ వంటి వారిని కొంతమంది ప్యాకేజీ లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు పీవీఎన్ మాధ‌వ్. ప్రశ్నించడం పేరుతో దూషణలు చేయడం మంచి విధానం కాదన్నారు. ప్ర‌శాంతంగా రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్న కూటమి బలాన్ని విచ్చిన్నం‌ చేయాలని చూస్తున్నారని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు.

పరిధి దాటి మాట్లాడే వారి పై కఠిన చర్యలు ఉంటాయని , ఎవ‌రికీ భ‌య‌పడాల్సిన ప‌ని లేద‌న్నారు. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ స‌మాజంలో అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడితే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు పీవీఎన్ మాధ‌వ్. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తుల పై యన్.ఐ.ఎ అధికారులు దృష్టి పెట్టారని చెప్పారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతాలలో అలజడి సృష్టించాలని చూస్తున్నారంటూ మండిప‌డ్డారు. నిఘా వర్గాలు వారి‌ పై ప్రత్యేక దృష్టి పెట్టి అరెస్టు లు చేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌న్నారు.

రాష్ట్రంలో డైన‌మిక్ లీడ‌ర్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సార‌థ్యంలో అపార‌మైన అనుభ‌వం క‌లిగిన నారా చంద్ర‌బాబు నాయుడు నాయ‌క‌త్వంలో కూట‌మి ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంద‌న్నారు. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో పాల‌న సాగిస్తోంద‌ని చెప్పారు పీవీఎన్ మాధ‌వ్. ఇదే క్ర‌మంలో ప్ర‌జ‌ల‌కు ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తోంద‌న్నారు.