పట్టుదలతో నటిగా ప్రూవ్ చేసుకున్న భాగ్యశ్రీ భోర్సే

హైదరాబాద్ : ముంబైకి చెందిన భాగ్యశ్రీ బోర్సే ఎట్టకేలకు తను నటిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్టర్ బచ్చన్ తో ఆశించిన సక్సెస్ రాక పోయినా ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించినా జనం ఆదరించలేదు. కానీ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశీ కలిసి సంయుక్తంగా నిర్మించిన అఖిల్ అక్కినేని తో కలిసి కీ రోల్ పోషించిన లెనిన్ మూవీ దుమ్ము రేపుతోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేసి తీశారు. ఇందులో అఖిల్ కంటే భాగ్యశ్రీ బోర్సే అద్బుతంగా నటించిందన్న ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో తనకు సుదీర్ఘ కాలం తర్వాత ఎంతో నిరీక్షణ అనంతరం లెనిన్ తో బోణీ కొట్టింది. సినిమా ప్రమోషన్ సందర్బంగా తను కన్నీటి పర్యంతం అయ్యింది. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇక భాగ్యశ్రీ బోర్సే ది మధ్యతరగతి కుటుంబం. తను పాఠశాల విద్యనభ్యసిస్తున్న సమయంలో, ఆమె కుటుంబం నైజీరియాకు వలస వెళ్లింది. తన విలక్షణమైన యాస కారణంగా ఆమె వేధింపులను ఎదుర్కొంది. ఆమె తండ్రి ఉద్యోగం దొరకక చాలా ఇబ్బంది పడ్డారు. “దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి. నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు,” అని ప్రజలను ఉద్యోగం కోసం వేడుకున్నారు. ఆ రోజు, తన తండ్రికి మళ్ళీ ఇలా జరగనివ్వ కూడదని భాగ్యశ్రీ బోర్సే నిర్ణయించుకుంది. ఆ తర్వాత, ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, నిలకడగా పనిచేసింది. కఠోర శ్రమ, పట్టుదలతో సినిమాల్లోకి ప్రవేశించింది. ఇవాళ తను భారతీయ సినిమా రంగంలో భవిష్యత్తు ఉన్న యువ నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొందింది.