newsseals.com
News

షాబాద్ హంత‌కుడికి సీఎం స‌న్నిహితుడి స‌పోర్ట్

VijayaBhaskar July 13, 2026
newsseals-HarishRao

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం క‌లిగించింది షాబాద్ హంత‌కుడు రాజ్ కుమార్ వ్య‌వ‌హారం. దీనికి సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ కు సంబంధించి సంచలన ఆరోపణలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని పోక్సో, ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్‌ అరెస్ట్ కాకుండా కాపాడాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గ‌తి త‌ప్పింద‌న్నారు. అస‌లు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు.

పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇస్తే, నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడని ఆరోపించారు హ‌రీశ్ రావు. ఏపీలో వైసీపీ స్పోక్స్‌పర్సన్ నాగార్జున యాదవ్.. రేవంత్ రెడ్డి పెయింట్ వేస్తాడు అంటే ఆయనను అరెస్ట్ చేశారు.. నల్లబాలు ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తే అరెస్ట్ చేశారని, కానీ రేప్ చేసిన నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేయకుండా, వాడితో కూర్చొని పోలీసులు మందు తాగార‌ని ఫైర్ అయ్యారు. రోజు రోజుకు ఇలాగే ఉంటే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.