newsseals.com

వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్ల‌తో రోడ్ల నిర్మాణం

July 14, 2026 · VijayaBhaskar

వ‌న‌ప‌ర్తి జిల్లా : వ‌న‌ప‌ర్తి జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణానికి రూ. 359. 09 కోట్లు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. రూపురేఖలు మార్చే అత్యాధునిక రహదారుల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టామ‌న్నారు. పల్లెలను, పట్టణాలను ప్రపంచస్థాయి రహదారులతో అనుసంధానించడమే లక్ష్యంగా ఈరోజు వనపర్తి జిల్లాలో ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (HAM) రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కాంట్రాక్టర్లకే నిర్వహణ బాధ్యత అప్పగించే ఈ HAM విధానం ద్వారా సుదీర్ఘకాలం మన్నికగా ఉండే నాణ్యమైన రోడ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయ‌ని చెప్పారు. ఈ రహదారుల విస్తరణతో రవాణా సమయం, ఖర్చు తగ్గి ప్రాంతీయ పారిశ్రామిక , వ్యవసాయ ప్రగతి కొత్త పుంతలు తొక్కుతుందన‌డంలో సందేహం లేద‌న్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే… మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో సంక్షేమ పాలన అందిస్తోందని చెప్పారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రగతిశీల పాలన ఇలాగే కొనసాగుతుందని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మ‌నోహ‌ర్ రెడ్డి, కూచుకుళ్‌ల రాజేష్, మ‌ధుసూద‌న్ రెడ్డి, శాప్ చైర్మ‌న్ శివ‌సేనా రెడ్డి పాల్గొన్నారు.

Related News