newsseals.com
News

మ‌త‌ప‌ర‌మైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు

VijayaBhaskar July 17, 2026
newsseals-SupriyaaGoud

హైదరాబాద్ : మత పరమైన అంశాలకు సంబంధించిన హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి బంధువు సుప్రియ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో ఆమె తీవ్రంగా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న మా మేనల్లుడిని తీసుకు రావడానికి నేను పాఠశాలకు వెళ్లాను. అతని డైరీలో పాఠ్యాంశానికి సంబంధం లేని విషయాలు ఉండటం గమనించానని పేర్కొన్నారు సుప్రియా గౌడ్. కల్మా , ‘సుక్రాల్ఫేట్’ (Sucralfate) చదవమని ఒక ఉపాధ్యాయుడు రాయడం నేను చూశానని చెప్పారు. . ఇది పూర్తిగా తప్పు… మీరు విద్యను అందిస్తున్నప్పుడు, కేవలం దానికే పరిమితం కావాలని పేర్కొన్నారు.

వివిధ మతాలు, నేపథ్యాల నుండి విద్యార్థులు ఇక్కడ చదువు కోవడానికి వస్తున్నారు. వారు నాణ్యమైన విద్య కోసం వస్తున్నారని టీచ‌ర్లు, యాజ‌మాన్యం గుర్తు పెట్టుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు సుప్రియా గౌడ్. ‘కల్మా’ ‘సుక్రాల్ఫేట్’ అనేవి పాఠ్యాంశంలో భాగం కానే కావ‌న్నారు. అవి మతపరమైన అంశాలు. వీటిని పాఠ్యాంశాలతో కలపకండి. ఒకవేళ మీరు దీన్ని ఒక సబ్జెక్ట్‌గా చేర్చాలనుకుంటే, భగవద్గీత లేదా బైబిల్‌ను సబ్జెక్ట్‌గా పెట్టండి అని నిప్పులు చెరిగారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకున్నందుకు పాఠశాల యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. మేము డైరీని చూసి దీనిపై మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశామన్నారు సుప్రియో గౌడ్. అసలు ఎంత మంది విద్యార్థుల డైరీలలో ఇలాంటివి రాస్తున్నారో నాకు తెలియదన్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆమె కోరారు.