మహిళపై దాడి ఘటనలో చర్యలకు సీఎం ఆదేశం

అమరావతి : గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ గా స్పందించారు. సంఘ‌ట‌న‌ తనను తీవ్రంగా కలచి వేసిందని శ‌నివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని వెల్ల‌డించారు.

ఈ ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు నారా చంద్ర‌బాబు నాయుడు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో ఎంత‌టి వారైనా ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

  • Related Posts

    గుడిపాటికి ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారం

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రతి ఏటా మహాకవి దాశరథి పురస్కారం అంద‌చేస్తూ వ‌స్తోంది. ఈసారి కూడా ఈ ఏడాది సీనియర్ పాత్రికేయులు, రచయిత, విమర్శకులు గుడిపాటిని ఎంపిక చేసింది. ఈనెల 22వ తేదీ దాశరథి జయంతి…

    ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ సూసైడ్ నోట్

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పోలీస్ అకాడెమీలో శిక్ష‌ణ పొందుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పోలీస్ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపుతోంది. త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *