newsseals.com

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ సూసైడ్ నోట్

July 21, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పోలీస్ అకాడెమీలో శిక్ష‌ణ పొందుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పోలీస్ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపుతోంది. త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడంటూ ఇదే అకాడెమీలో శిక్ష‌ణ పొందుతున్న మ‌రో ఐపీఎస్ మ‌హిళ ఏకంగా పోలీస్ స్టేష‌న్ ను ఆశ్ర‌యించింది. విచిత్రం ఏమిటంటే త‌న గురించి గొప్ప‌గా పొగుడుతూ సందేశం ఇచ్చాడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. అంతే కాదు ఎక్స్ , ఇత‌ర సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా పంచుకున్నాడు. ఇప్పుడు త‌న బండారం బ‌య‌ట ప‌డ‌డంతో సూసైడ్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ సంద‌ర్భంగా నోట్ కూడా రాశాడు.

తోటి బ్యాచ్ మెట్ తో ఏడాది నుండి రిలేషన్ లో ఉన్నానని పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత కూడా రిలేషన్ లో ఉన్నామ‌ని, నా రూమ్ కు వచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్పిందని తెలిపాడు. త‌న వ‌ద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని, ఇదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పానన‌ని పేర్కొన్నాడు నోట్ లో. నా రూమ్ లో ఏంజరిగిందో ట్రైనీ ఐపీఎస్ మహిళ భర్తకు తెలుస‌ని తెలిపాడు. కానీ మ్యానిపులేటేడ్ చేసి నన్ను బ్లేమ్ చేస్తోందంటూ వాపోయాడు. ఆమె స్వతహాగా నా రూమ్ కు వచ్చిందన్నాడు. తన సూసైడ్ కు నలుగురు కారణమంటూ లేఖలో పేర్కొన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అన్ని ఆధారాలు తన ఐఫోన్ లో ఉన్నాయని స్ప‌ష్టం చేశాడు.

Related News