newsseals.com

శుభ్‌మన్ గిల్ వ‌ల్లే టీమిండియా ఓట‌మి

July 22, 2026 · VijayaBhaskar

చెన్నై : మాజీ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ దినేష్ కార్తీక్ నిప్పులు చెరిగారు. భార‌త జ‌ట్టు వ‌న్డే , టెస్టు జ‌ట్లకు కెప్టెన్ గా ఉన్న శుభ్ మ‌న్ గిల్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు. త‌న నిర్వాకం కార‌ణంగా భార‌త్ ఓట‌మి పాలైంద‌ని, వ‌న్డే సీరీస్ కోల్పోయింద‌ని ఆరోపించాడు. ఓ వైపు కోచ్ గంభీర్ ఇంకో వైపు శుభ్ మ‌న్ గిల్ లు త‌మ‌కు తోచిన రీతిలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని, అంతే కాకుండా ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్ల‌ను ప‌క్క‌న పెడుతూ త‌మ‌కు ఇష్ట‌మైన వారిని ఎంపిక చేస్తుండ‌డం వ‌ల్ల‌నే భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని పేర్కొన్నాడు దినేష్ కార్తీక్.

ఈ సిరీస్ ఓటమికి ప్రధాన కారణం శుభ్‌మన్ గిల్ అని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. మొదటగా గిల్ తన నెమ్మదైన, స్వార్థపూరిత బ్యాటింగ్‌తో పవర్‌ప్లేను నాశనం చేశాడ‌ని మండిప‌డ్డాడు. విదేశాలలో ఇషాన్ కిషన్ విఫలమవుతున్నప్పటికీ, అతనికి మద్దతుగా నిలుస్తూ, దేశీయంగా రాణిస్తున్న అగ్రశ్రేణి ఆటగాళ్ల కంటే ఫ్రాంచైజీ స్నేహితులకు ప్రాధాన్యత ఇచ్చాడ‌ని ఆరోపించాడు. కేవలం స్నేహ కోటాను అనుసరించి గిల్‌ను ఎంపిక చేశారు. కుల్దీప్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్‌ను జట్టు నుండి తొలగించడం, అనుభవజ్ఞులైన సీనియర్లను బెంచ్‌కే పరిమితం చేయడం పూర్తి కెప్టెన్సీ వైఫల్యాన్ని చూపిస్తుందని పేర్కొన్నాడు. గిల్ నెమ్మదైన స్ట్రైక్ రేట్, బరి తెగించిన పక్షపాతం టీమ్ ఇండియాను ముంచి వేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. బీసీసీఐని త‌ప్పు ప‌ట్టాడు.

Related News