ప్రజా ఉద్యమానికి తలొగ్గిన మోదీ : టీపీసీసీ చీఫ్

హైదరాబాద్ : ఈ దేశంలో ఎవరూ శాశ్వతంగా అధికారాన్ని చెలాయించ లేరని, ఆ విషయం విద్యార్థుల ఆందోళనలతో తేలి పోయిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దెబ్బకు గత్యంతరం లేక కేంద్రం దిగి వచ్చిందన్నారు. భారీ ఎత్తున జెన్ జి ఉద్యమానికి మద్దతు ఇస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరేలా భారీ ర్యాలీ నిర్వహించామన్నారు. సీఎం రేవంత్ పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు. ఏకఛత్రాధిపత్య ధోరణికి వ్యతిరేకంగా ఏకమైన విద్యార్థి లోకం . నీట్ (NEET) పరీక్షను సక్రమంగా నిర్వహించలేని దుస్థితి నెలకొందన్నారు. చైనా ఆక్రమణలను అడ్డుకోలేని దుస్థితికి ఎందుకు చేరుకుందో ఒక్కసారైనా మోదీ ఆలోచించారా అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్.
విద్యార్థుల ఒత్తిడికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ ఎద్దేవా చేశారు. విద్యార్థులపై లాఠీచార్జిని ఏకకంఠంతో ఖండించింది ఈ దేశం అని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్. కొడంగల్‌లో సీఎం పర్యటన, వరంగల్‌లో డిప్యూటీ సీఎం ర్యాలీ, టీపీసీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. నాడే 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు. నేడు అసెంబ్లీ లేదా పార్లమెంట్‌లో తమ గళం వినిపించలేని స్థితిలో యువత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ‘జెన్-Z’ (Gen Z) తరం నుండి ఒకరికి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారని ప్రకటించారు. 21 ఏళ్లకే చట్టసభల్లోకి ప్రవేశించేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు.