newsseals.com
News

రూ. 17,912 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించ‌నున్న మోదీ

VijayaBhaskar July 30, 2026
newsseals-KolusuParthasarathy

అమ‌రావ‌తి : ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ విష‌యాన్ని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్ల‌డించారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా భోగాపురంలో రూ. 17,912 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నార‌ని తెలిపారు. భోగాపురంలోని ‘అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం’ ‘గ్లోబల్ ఆంధ్ర’కు ముఖ ద్వారంగా నిలుస్తుందని, ఈ ప్రాంతాన్ని వలసల భూమి నుండి కార్పొరేట్ పెట్టుబడుల కేంద్రంగా మారుస్తుందనిపేర్కొన్నారు. ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా, ఆగస్టు 1న రూ. 17,912 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని , అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు.

మంత్రి మాట్లాడుతూ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ‘గ్లోబల్ ఆంధ్ర’కు ముఖద్వారంగా పనిచేస్తుందని, ఇది ఈ ప్రాంతాన్ని వలసల భూమి నుండి కార్పొరేట్ పెట్టుబడుల కేంద్రంగా మారుస్తుందని అన్నారు. స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ‘ఫ్లయింగ్ ఫిష్’ (ఎగిరే చేప) ఆకారంలో రూపొందించిన ఈ విమానాశ్రయం, అత్యాధునిక ‘గ్రీన్ ఫీల్డ్’ పర్యావరణ ప్రమాణాలను పాటిస్తుందని, అలాగే ఎగుమతులు, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, 500 ఎకరాల విస్తీర్ణంలో ఏవియేషన్ హబ్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, ఎడ్యు సిటీ (Edu City), విమాన పరికరాల తయారీ , మరమ్మతు కేంద్రాల వంటి అదనపు కార్యక్రమాలు కూడా ప్రణాళికలో ఉన్నాయని పార్థసారథి తెలిపారు. ఈ ప్రాంతంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.